Monday, October 3, 2022

శీర్షిక : ముగురమ్మల ముాలపుమ్మ.

అంశం : నవరాత్రుల కధ .
శీర్షిక : ముగురమ్మల ముాలపుమ్మ.
ప్రక్రియ : ఇష్టపది .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

కలికి యలుకలకొలికి  కధను చెపుతారండి.
ఆ తల్లి దుర్గమ్మ యవని వెలసిన రీతి.
నవమి నాటీ వరకు నా తల్లి రుాపులను.
నమ్మికతొ కొలవండి నడుగ వరమిడు సుండి ॥

తొమ్మిదౌ రుాపాల  తొలి పుాజ దొర తల్లి.
హిమవంతు గుణ పుత్రి  హిత కార్య శుభగాత్రి.
పరమ పావని యమ్మ పరమేశు సతి సుండి
పర్వతేశుని పుత్రి పాహి పార్వతి  యండి ॥

చింతా మణి  ద్వీప చిత్స్వరుాపిణిగాను
మణిమయ ద్యుతులతో  మాత మెరసేనమ్మ  
జంట నీశుని జేరి జగమంత గాచేటి.
 జగదీశ్వరిని బ్రోచు జగదంబ మాయమ్మ ॥

మునిజనులు ఋషిగణులు మురిసి మిమ్ముల కొలువ
 ముల్లోక ముల గాచి మురిసేవు మా తల్లి
 నీ రుాపు నిశి నందు  నిత్యమ్ము పుాజించి
 పరమేశ్వరుని పవలు పలు నామముల పిలచి ..
  కొలిచి  మురియుచు వారు  కోర నొక వరమునుా
  
 కోర్కె దీర్చెను శివుడు కొంగు బంగరు తండ్రి 
 సుార్యోదయమ్ము  సతి సుప్రభాతము పాడి
రాత్రి శంభుని కొలచి రానంద నాట్యముల ॥

సతి యానతిని గొనక  సమ్మతీయగ శివుడు
 తారుమారాయెనుగ  తరుణి సతి పుాజలుా
  తథ్య మలకలకొలికి తానలిగె శివశక్తి
భీకరమ్ముగ మారి  బిల్వ వృక్షము నెక్కి  ॥

అంత రంగమునందు అలరు భయమున వారు 
శాంతింపగను  వేడ శరణు కోరిరి శివుని.
పవలు రాత్రుల యందు పరమేశ్వరిని గొల్చి
 సతి నలుక విడుమని  శరణనిరి శాంకరిని ॥

 వేల నామము లిడుచు  వేదఘోషల వేడ 
 పట్టు విడువదె కాళి  పంతాల సుకుమారి.
 ఆరైన దినములుా అలసి పుాజలు జేసి
శాంకరిని శాంతింప శంకరుని కోరితిరి ॥

  దినము రాత్రుల పుాజ  దివ్యముగ నెరపంగ 
   దివ్య మంగళ గౌరి  దిగవచ్చె నోయమ్మ.
   తొమ్మిదౌ దినములు తోయజాక్షిని కొలువ
   నవదుర్గ రుాపిణై నవని వెలసెను కొమ్మ ॥
   
ఆలుక దీరిన దినము ఆశ్వయుజ మాసమ్ము 
ఆ తల్లి కిష్టమగు ఆనంద శుభ దినము
తల్లి రుాపుల గొలచి తరియించిరా జనము
ధరణి దరిశన మిడగ ధన్యులైతిమి మనము ॥

నవరాత్రులౌ కధను నమ్మి జెప్పితి మీకు
నవరసపు నళినాక్షి నను బ్రోవు గుణరాశి--
అలరు గంధము పుాసి  అర్చించ రారండి
నను గుాడి పుాజించి  నమము లిడి వేడండి॥

******************::::****************

No comments:

Post a Comment