తేది: 30-8-2022.
ప్రక్రియ : రుబాయిలు
శీర్షిక : విలువలను తెలుసుకో
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి :
కల్యాణ్ మహారాష్ట్ర .
వృద్ధులెైన తల్లిదండ్రుల -
నగౌరవము పరచవద్దు.
తోడబుట్టు వారినెపుడు
అవమానము చేయవద్దు.
మంచిగుణము మానవులకు
సధ్ధనమని మరచిపోకు.
మానవత్వ మదినిండిన
దృక్పథమును విడువవద్దు ॥
ఇరుగుపొరుగు వారితోడ
స్నేహముతో మెలగాలిగ
ధర్మమైన మార్గములో
సహనముతో నడవాలిగ
దేశభక్తి నిండినట్టి
సద్భావన కలిగియుండి
న్యాయమైన బాటలోన
నియమముతో నిలవాలిగ ॥
మన సంస్కృతి, సంస్కారము,
మనదేశపు గౌరవములు ॥
సమతమమత కలుగుటలే
మనభావపు సద్ధనములు ॥
చేయి చేయి కలిపినడచి
కష్ట-సుఖము పంచుకొనుము
మనుజులకివి మేలుజేయు
మంచివైన సద్గుణములు
****************
నీకోసం అన్నివదలి వస్తానుగ ఓచెలియా
మరపించే ప్రేమపంచి ఇస్తానుగ ఓచెలియా
అందరినీ వదలివచ్చి ననుజేరిన నాదానివి
మనసైనది నీవుకోర తెస్తానుగ ఓచెలియా ॥
అంశం : సాహిత్యాశం .
ప్రక్రియ : రుబాయిలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ఎన్ని వేట్లు వేసినా ఒరిగిపోయిన చెట్టు చిగిరిస్తుంది.
ఎన్ని తుాట్లు పొడిచినా పగిలిపోయిన గుండె .ప్రేమిస్తుంది
ఒకరి లాలించిన ఆమ్మైతే ఒకరు పాలించిన అమ్మ
ఎన్ని సార్లు అవమానించినా ఆమ్మతనం ఆదరిస్తుంది.॥
ఎన్ని కోట్లు వెచ్చించినా కోల్పోయిన ప్రేమ కొనలేవు
ఎన్ని పాట్లు పడినా గతించిపోయిన నిన్న కనలేవు.
జీవితంలో ప్రతీ పదానికీ అలోచించి అడుగేయాలి
ఎన్ని ఇక్కట్లు పడినా మాటజారిన చోట మనలేవు ॥
విద్య నేర్చినవాడు వివేకవంతుడవుతాడు
విజ్ఞాన శాస్త్రం నేర్చినవాడు మేధావంతుడౌతాడు.
పై రెండుా ఉన్నవాడు తత్త్వ-జ్ఞాన సముపార్జనుడు
వారందరితో బంధమున్న వాడు కీర్తిమంతుడౌతాడు.॥
అక్షరం తలరాత మార్చు వరం మిత్రమా 21
ఆవేశం అనర్ధాలను పెంచు మిత్రమా 21
నిరక్షరాస్యతది ముార్ఖత్వానికి ముాలం .
చదువది, సమయొాచిత సంస్కారము మిత్రమా ॥
నీతులు చెప్పడం ఎంతోమంది చేస్తారు.
నియమాలు పాటించమని కొంతమంది చెప్తారు.
చెప్పేముందు చేసి చుాపించడం మంచి లక్షణం.
పని చేసేవారు మాటలాడరని చాలామంది చెప్తారు.॥
పసి పిల్లలలో అమాయకత్వం చుాస్తాం మనం
యువతలోని ఆవేశతత్త్వం చుాస్తాం మనం
మధ్యవయస్కుల్లో జీవితానుభవ పుాదోటలు.
వృద్ధాప్యంలో పండిన మనస్తత్వం చుాస్తాం ॥
******
నీమురళి పాటలలో రాగమై పాడనా
నీపాద సవ్వడుల మువ్వనై ఆడనా
నీరాక నిరీక్షణ నలసినాను దేవరా
నీ కరుణ చుాపులకు రాధనై వేడనా ॥
గురువులకు ఎల్లపుడు కైమొాడ్చు భక్తితో
రైతన్న లెప్పుడును చమటోడ్చు శక్తితో
కష్టమున సుఖముంది తెలుసుకొని మసలుకో
శ్రామికుడు ఎల్లపుడు శ్రమకోర్చు యుక్తితో
దేశంలో ఎవ్వరికీ బ్రతికేందుకు దారిలేదు.
పాలించే ప్రతినిధులకు ప్రగతిబాట తీరులేదు. అడుగడుగున ఆధిపత్య పధికారపు పోరుజోరు.
బడుగుజీవి బ్రతుకుతీరు బాగుపడే ఆశలేదు.॥
బడుగుజీవి మురికివాడ తాగునీటి చెమ్మలేదు
అన్నదాత అగచాట్లను ఆదుకొనే అమ్మలేదు
ఓటుహక్కు నోటుకమ్మి బ్రతుకంతా ఓడిపోకు
నిండియున్న స్వార్ధాన్నదె ఊరికనే నమ్మలేదు
న్యాయపోరు చేయువారయ బ్రతుకునెపుడు అమ్మలేరు
అజ్ఞానము నిండియున్న మనిషినెవరు నమ్మలేరు
విధియాడిన ఆటలోన మనిషేఒక తోలుబొమ్మ
స్వార్ధపరులు మనుషులెపుడు మార్పుతీర్పు కోరలేరు ॥
********
అంశం : రుబాయిలు .
రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర
మనసుకు నచ్చని మాటలు వినుటది కష్టము
మనసుకు నచ్చిన పాటలు వినుటది ఇష్టము
పలువురు మెచ్చే నడతలు కీర్తికి బాటలు
మనుజులు మెచ్చని పనులవి చేయుట నష్టము ॥
జీ ఎస్ టీ వల్లమనకు లాభములవి ఉన్నాయా
ప్రైవేటీ కరణవల్ల కష్టాలవి పోతాయా
అట్టికేంద్ర నిర్ణయాలు అందరికీ సమ్మతమా
నిర్ణయాల బాటలోన ఉన్నవుాడ్చి పోయేయా ॥
బడుగువారి భాధలకిడు అర్ధాలవను వినగరావు
జాతిమతపు జడ్యాలకు యుద్ధాలను మనగరావు.
నీస్వార్దం మనుషులతో ఆటలాడు కుంటున్నది.
చితికిపోవు జీవితాల చింతలనువు కనగరావు .
*********
9/8/22.
సాహిత్యాంశము : మంచిని పెంచుకో.
ప్రక్రియ : రుబాయిలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
**********************
మహతి సాహితీ కవి సంగమం
9/8/22.
సాహిత్యాంశము : మంచిని పెంచుకో.
ప్రక్రియ : రుబాయిలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
గులాబీకి ముళ్ళుం టాయని వదిలేయగలమా .
పుాలెన్నో పుాస్తుం టాయని చిదిమేయగలమా .
మనిషి గుణగణాలు విజయానికిల సోపానాలు.
అలాగని భువిలో బ్రతకడం మానేయగలమా॥
తెల్లనివన్నీ పాలుకావు.
నల్లని వన్నీ నీళ్ళు నీళ్ళుకావు
అందం, అది మనిషికి శాపం..
చుాసినవన్ని నిజాలుకావు. ॥
జీవితంలో మంచి చెడులను తెలుసుకో.
అందరితో నువు స్నేహంగా మసలుకో.
చెడ్డవాడికిట విలువ లేదు .
గంజాయి వనాన తులసిలా నిలిచిపో॥
గుణవంతుడు అందరికీ మంచినే పంచగలడు.
మంచిపనులు చేస్తే హాయిగా జీవించగలడు.
నోరు మంచిదైతే ,ఊరంతా మంచంటారు.
సద్గుణాలున్నవాడే, లోపాలనెంచగలడు.॥
చేయి కలిపితే స్నేహము .
పోరు సలిపితే యుద్ధము.
మనిషిగా ఆలోచించు.
నేనన్నిటికీ సిద్ధము.॥
సవరించి పంపినవండీ..🙏
***********************
పరిమళిస్తున్న పుాబాలలను చిదిమేయగలమా మానవత్వం నశించిందనిబ్రతకడంమానేయగలమా॥
11/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం. 19 ని పంపాలి.
అంశం: రుబాయిలు.
శీర్షిక : జీవిత సత్యాలు.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
కలసీ-మెలసి మీరుంటేను కలదు సుఖం.
ఒంటరివైన క్షణములోన వలదు దుఃఖం.
సుఖ దుఃఖములు అన్నవన్నీ కర్మఫలాలు .
కర్మభోగం నమ్మనంటే దాగదు నిజం ॥
మతజాడ్యం విడువునీవు అందరునుా సమానమే
కష్టానికి తోడుంటే అందరముా నీవారమె
బీద గొప్ప బేధాలవి సమాజముకు చెడుపుగదా
సమానత్వ బాటనునడు-అనుభవముా ఆనందమే॥
11/10/202
అంశం: రుబాయిలు.
శీర్షిక : జీవిత సత్యాలు.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
మాపాపాయి నన్నుపిలచీ నన్నేహత్తుకు నిదురపోయింది
మరంతలోనే చుాస్తుండగానె ఎంతోఎత్తుకు ఎదిగిపోయింది.
నా అనుకున్నది నన్నొదిలి యెటుా వెళ్లదనుకున్న ..
ప్రేమపేరుతో పెళ్ళిచేసుకొని వయసిడుమత్తుకు
లొంగిపోయింది ॥
పసిపిల్ల లల్లరులు ఇంటింటి-కందాలు .
అమ్మాయి లందరుా వేరింటి బంధాలు
ఆడ మగ అనుమాట ఎప్పుడుా అనబోకు
ఇద్దరుా అమ్మ ఒడి పండంటి గంధాలు ॥
*****************************:::**
రుబాయిలు.
బోనాల పండగకు భోగాలే విందుగా
ఆ తల్లి పుాలతో నిండెనులే విందుగా
బంగారు బతుకమ్మ కొలువైన సందడులే
ఆట పాటల వేడ్క లేలెనులే పసందుగా ॥
No comments:
Post a Comment