Tuesday, October 11, 2022

శీర్షిక : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .



⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*ఉత్తమ పద్యకవులు:(12-10-2022)*
శ్రీ/శ్రీమతి 

1. డా. కురవి వేంకట కృష్ణశాస్త్రి గారు
2. డా. వేదాల గాయత్రీదేవి గారు
3. మగటపల్లి రామచంద్రరావు గారు
4. గుడిపూడి రాధికారాణి గారు
5. ఎలగందుల లింబాద్రి గారు
6. కొంటికర్ల లలిత గారు
7. పోతుకుచ్చి రాజశేఖర్ గారు
8. పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
9. ఎం.వి.ఉమాదేవి గారు
10. మీసాల చినగౌరినాయుడు గారు
11. గద్వాల సోమన్న గారు
12.డా.సూర్యదేవర రాధారాణి గారు
13. గడ్డం కృష్ణా రెడ్డి గారు
14. పోగుల భాగ్యలక్ష్మి గారు
15. సింహాద్రి వాణి గారు
*********************
*పర్యవేక్షక,నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

శీర్షిక  : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
.1.
కోర్కె లుండ వచ్చు కోర తగిన యంత
తీరు కొలది కోర్కె  తీరు హెచ్చు
కోర్కె తీరకున్న క్రోధంబు హెచ్చుగా
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
2.
ఆశ పోతు తనము ఆశయ లోపమ్ము
కలుగ జేయు నదియె కడుని రాశ
కడకు కోర్కె తీర కాని పనుల జేయు
లంచ గొండి యైన లక్ష ణముల ॥
3.
పులిని జుాచి నక్క పుార్తివాతల దేలు
చంద మదియె గాద చాలు ఆశ
స్వార్ధ గుణము పెరుగు స్వస్థతేలడు ప్రాణి
మనసు మలిన మౌను మహిని మనుజ ॥
4.
కడకు పతన మొందు  కర్మ మిగులు నీకు
మితము జీవి తమ్ము మిగులు భువిని
కోర్కె యున్న మనిషి కోల్పోవు సుఖమును
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
5.
విద్య లెన్నొ నేర్చి వినుతి కెక్కుము నీవు
జ్ఞాన ధనులు చెడరు జగము నందు
సాహితీ వనమదె సరికోర్కె విహరింప
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
6.
చిన్న తనము యంచు చిన్నతప్పులుజేయ
తప్పు లొప్పు లౌన తప్పు తప్పే.
తప్ప లెంచ నీక తగురీతి మనుటకై
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
7.
విషయ వినయము లవి విద్య తోడనెవచ్చు
సార విద్య నబ్బు సభ్య తిలను.
మంచి మాట నోట మంది మెచ్చిన బాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
8.
తల్లి తండ్రి గురువు  తగురీతి బోధించు
చక్క నైన మాట చద్ది ముాట.
అనుభవాలు నేర్పు నవెగాద సుఖబాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
9.
ప్రథమ పాఠ శాల ప్రారంభ మింటితో
తోడు తల్లి దండ్రె తొలి గురువులు.
గారవించుమెపుడు ఘనమైన రీతిలో
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
10.
సార మైన బ్రతుకు సజ్జనుండదె కోరు.
సద్గుణములు నేర్వ  సమయ మిడుమ.
సత్య మేగ జయము  సచ్చరిత యెధనము
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥

********************************

12/10/2022
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : నీతి.
శీర్షిక  : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .
ప్రక్రియ : ఆటవెలది .
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
11.
చిన్న పిల్ల లింట చిందులే యుచునున్న 
ముచ్చటౌను మనకు  ముద్దు మీర.
మాటలొచ్చు వయసు  మంచి మాటలు నేర్పు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
12.
పిన్న వయసు లోనె పిలచి సుద్దులు నేర్ప
లోక మందు మసల లోటు రాదు.
మితము మాటలాడి మించుగౌ రవమంద
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
13.
కట్టు బొట్టు తీరు కడు సభ్యతల నేలు
భరత భుామి కీర్తి బడయు వెలుగు
సాంప్రదాయ ములవి సద్ధర్మ  పథములు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
14.
అమ్మ చెల్లి అక్క యైనవా రనుచును
రక్త బంధములని రక్షణిడుచు
పరుల స్త్రీల జుాడ పరాచికములేల..?
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
15.
ఆడ పిల్ల లింట నా లక్ష్మి రుాపాలు.
మెట్టి నింటి వారి మేలు కోరు
అన్ని రుాపు లేలు నాశక్తి రుాపాలు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
16.
పొల్లు మాట లాడి పోట్లాట లిడునట్టి
నరుని గుణము  మహిని నగవు పాలు.
మంచి నడత తోడ మహిలోన మననీవు.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
17.
మితము మాటలాడు మీరజాలకు హద్దు
హీన పడని మాట హితవు నీకు.
అతిగ మాటలాడ అలుసౌదు విలలోన.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
18.
అమ్మ అక్క చెల్లి యనురక్త బంధమ్ము..
లాదరింతువు గద యవని నీవు
యెదుటి, స్త్రీలను గన యేటికిీ మేలము  
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
19.
ఆడ పిల్ల లింటి, అమ్మతల్లులు వారు
శక్తి రుాపు దాల్చు .శతృ వెదుట .
వారు శాపము నిడ  వదలిపోవుసిరులు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
20.
కల్ల మాటలాడి కపటివై మెలగుచుా
చేయు బాస లెల్ల చెడపు నిన్ను.
నమ్మ రెవరు సుమ్మ నామాట నిజమన్న 
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥

*********************************


No comments:

Post a Comment