అంశం : దత్తపది: - తతి - మతి - వతి - గతి*
ప్రక్రియ : సీసపద్యము.
తరలివ చ్చెనదివొ (తతి)గుాడి గణపతి
విఘ్నము లనుబాప విశ్వ మునకు
పా(ర్వతీ )పుత్రుడుా పసుపుబొ మ్మతగాడు
బుద్ధి బాలుడతడె భువిని వేల్పు ॥
సార(మతి)కి నిండు సాక్షి భుాతమువాడు
జ(గతి)నే లెడువాడు జయము మనకు
గురుగణ (తతి)తోడ గుాడి యుండెడు వాడు
పుణ్య(వతి) సతీ పుత్రు డతడు ॥
ప్రక్రియ : ఆటవెలది.
ప్రథమ పుాజ్యు నిగను ప్రాశస్త్యమును పొంది
విఘ్నహరు నిగను విశ్వ మేలె
పార్వతీ సుతుండ పాహీగ ణాధిపా
కావు మయ్య మమ్ము కరుణ తోడ ॥
No comments:
Post a Comment