Saturday, October 29, 2022

స్ఫుార్తినిచ్చు పతాకం.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా..

అంశం : త్రివర్ణ సందేశం .
శీర్షిక  :  స్ఫుార్తి నిచ్చు పతాకం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అదిగదిగో  బానిసత్వ మొదలించిన ఝండా
అదిగదిగో స్వాతంత్ర్యపు సర్గ మిడిన ఝండా
ఆంగ్లేయుల తరిమికొట్టె ఆయుధమై ఝండా
మన ఆశల బాట పుాలు జల్లినదీ ఝండా ॥

గాంధి నెహ్రూ వంటి త్యాగ-ధనుల దీక్ష సాక్షిగ
స్వాతంత్ర్యోద్యమ బాటను  కేతనమై నిల్చెగా
అసువులు బాసిన సైనిక వీర గతికి సాక్షిగా
చారిత్రాత్మక ఘటనల చెగని ముద్రల కోటగ ॥

ఎగురుతున్నదదిగో  ఏక బిగిని ఠీవితో
పలుకుతోంది పలుభాషలు తేనెలొలుకు తీపితో
మువ్వన్నెల సోయగాల ముచ్చటైన మేనితో
ఐకమత్యమే బలమని చాటిచెప్పు నీతితో  ॥

జాతి బేధ మెంచకంటు మేలు మంచి మాటలతో
కుల మతాల జాడ్య మొదలి కలిసి పోగ చెలిమితో
మనమంతా ఒక్కటనే మమతల సందేశ మిచ్చు--
మన బాటను పుాదోటగ మార్చు స్ఫుార్తి గీతితో ॥

నీతి , న్యాయ, మార్గములో నడచుటె మన ధర్మ మని
ప్రీతి పరుల జేయుటలే బ్రతుకు మనిషి సార్ధకతని
పరుల మనసు నొప్పించక తానొవ్వక బ్రతుకమని
చాటి చెప్పె మన ఝండా, తల ఎత్తుకు నిలవుమని ॥

No comments:

Post a Comment