Monday, October 17, 2022

బ్రతుకు పోరాటం. కవిత

17/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
చిత్రకవిత -13
శీర్షిక : బ్రతుకు పోరాటం .

ప్రక్రియ : ఇష్టపది .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 

కాయ కష్టముతోడ కన్నవారిని సాక
కదలి పోతున్నాడు కధకుడతడేచుాడు.
భుామి పుట్రలుపోయె భుక్తి కరువైపోయె
కాలు కడుపును, కలియె కాటు వేసిందాయె॥

నమ్మిన మట్టిలోని నాటిన విత్తనాలు 
 ఊపిరికే  బరువాయె ఉచ్చులై బిగువాయె
పంట రాబడిలేక  ఫలము దిగుబడి రాక
కర్షకుడే చితికెగ  కన్నీరై కురిసెగ ॥

 పడని చినుకు బరువై  పచ్చ దనము కరువై  
ఎడ్లు యెండిపోయెగ ఎగసి గుండె పగిలెగ
బీడు వారు భుామిని విడుచుటే నయమనీ
తలచి రైతు కదలెగ వలచు పల్లె నొదలెగ ॥

కల్లలైన కలలవె కన్నీరై  పారెను 
మారెను రోజులవని మనసు సర్ది జెప్పెను.
బ్రతుకుకు దారి లేక బంధాలు విడలేక
పట్న బాట వలసిడె  పలుక దుఃఖ మేలగ ॥

ముక్కు పచ్చలారని ముద్దుగారు పిల్లలు
మురిసి పయనమాయిరి ముచ్చట్లను తేలిరి.॥
చక్రాల చెక్కనదె  చేర్చిరెడ్ల(ఎడ్లు) వెనుకకు
ఎడ్ల మెడకు తాడిడి  ఎక్కె పీట వడి వడి.

అభము శుభము నెరుగరు అమాయకపు పిల్లలు 
తండ్రి బాధ నెరుగని తహ తహల పిల్లలు
గొడ్డు గోదల నొదలి గొంతు పెగలని మజిలి
దిగజారె వెన్నెముక దిక్కెవరుర మనకిక ॥

************************::::**********

No comments:

Post a Comment