Saturday, October 22, 2022

బాల సాహిత్యం ..".ప " గుణింతాక్షరాలతో...

22/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : బాల సాహిత్యం .
ప " గుణింత పదాలతో..
శీర్షిక  : జన్మకు సార్ధకత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 


పలుకు తేనె లొలుకు  మెరుగు భాషల తల్లి 
పిలుపు వలపుల వల్లి  సమత మమతల మల్లి
పసిడి పంటల శోభ సాంప్రదాయపు మెరుగు
పడతి  భారతి మనకు  పంచు వెన్నెల వెలుగు ॥

పుాల వనములు నిండు పుడమి సారము నందు
పికము- సుకములు యున్న తరుల సిరులే మెండు  
పచ్చదనమును పంచు ప్రకృతి వనరులయందు
పలు ఓషధులు నిండు వన ముాలికలు మెండు

పరుగులిడెడు నదుల,ఝరులె యందముసుండు
పెక్కు సంపదలున్న ఖనిజ సంపద విందు.
పారు నీటిని నిండు జలరాసులెన్నెన్నొ
 పొంగు సాగరమందు దాగు నిధులను కండు॥
 
 పిల్ల పాపల బలము- పాడి యావుల పురము
పాలు వెన్నలు కురియు- పుష్కలంబుగ గనుము
- పలికేటి మంత్రములు పలు ధర్మ శాస్త్రములు
పరుల నొప్పించకుమను  -ఫల నీతి చంద్రికలు ॥

పుట్టు విలువల రీతి పలు సంస్కృతుల నీతి
పుణ్య గ్రంధ పఠనముతొ పట్టు నీ నడత 
పుణ్య చరితల కధలు జీవితాలకు వెలుగు
పుాజించు కొలువులకు  పుణ్య భుామియె నెలవు ॥

పలుకు మన భాషను పాటించు సంస్కృతిని 
పుడమి జన్మ మనది మన తల్లి భారతి
పేరు పేరున శుభము వాడ వాడలు ఘనము
ప్రజ్ఞాశాలుల జ్ఞాన  విద్య మేధల గనుము ॥

పెరుగు చద్ది ముాట పెద్దవారల మాట
పేచి వలదు చదువ పెద్దబాలశిక్ష
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పోరు పెట్టకెపుడు  జోరు నెపుడు ॥

పట్టి గౌరవించు మన జన్మ భుామిని
పాటించు  తల్లిదండ్రి జెప్పేటి మాటను.
పదములంటీ గురుల ఆశీస్సులను గొనుము
పలుక మంత్రములివియె  పలుధర్మాచరణములు ॥

పొందినట్టి జన్మ సార్ధకతను పొంద
పాటించు పద్ధతుల పరధర్మముల విడచి.
పరగ జాతులు వేరు ధర్మంబు లొక్కటే
పలుక సుభాషితములు పెరుగు మమత ॥

No comments:

Post a Comment