Saturday, October 29, 2022

మనుజ తెలుసుకొనుమ మంచిమాట.

.

శుద్ధి లేని మాట శుభము నీకదికాదు
మనసు లేని యాత్ర మహిని వమ్ము ॥
బుద్ధి లేని మనసు బుధజను లనుబాయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
22.
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పెద్ద వారి మాట చద్ది ముాట
పెరుగు నీదు విలువ పెంచ జ్ఞాన ధనము
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
23.
పట్టి పట్టి జుాచి పరధర్మ జులరోసి
పెంచ బోకు రణము నెంచు విధము
మానవత్వ మదియె మనిషి ధర్మ మిలను
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
24.
తేనె లొలుకు పలుకు  తేటగీ తులవిందు
తెలుగు భాష మనది తెలుగు వెలుగు
దేశ భాష , నిండు దేశ భక్తియె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
25.
పచ్చ దనము లెేక ప్రకృతి వికటించ
ప్రబలె రోగ బాధ ప్రజల లోన
కండ్లు విప్పు మయ్య గావ పుడమి నీవు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
26.
అడుగు వదల నట్టి  ఆకాస హార్మ్యాలు
తాగు నీరు మురిగె తావు లేక
జనులు పెరుగ పేరె కలుషితమ్ములుచాల
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
27.
కోరి చెట్లు గొట్టి  కొండ బండలు జేసి
కుార్చునున్న కొమ్మ కుాడి నరుకు
ముార్ఖుడైన మనిషి ముందడుగెటులేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
28.
గాలి నీరు లేక గతక గింజలు రాక
మహిని బ్రతుకు లాయె మట్టి పాలు.
భావి భరత చరిత భావించి అడుగేయ
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
29.
డబ్బు డబ్బు యంచు గబ్బులో కాలిడీ
కడుగ నీరు లేక కలత చెందు
కడకు సుఖము లేని కలిమి లేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
30.
పాడి పంట లెల్ల పరుల కమ్మిన కీడు
పట్టి గొట్టు నిన్ను   పట్టు బట్టి
మాతృ భుామి నీది మర్మ మేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
శీర్షిక  : మనుజ తెలుసుకొను మంచి మాట.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.
31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ 
పలుకసత్యమాడు  పాపమేటికి నీకు
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు బాట
పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
పలుకు శాంతి నేల పలుధర్మ  శాస్త్రాలు
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
34.
ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పెక్కు నిధులు
గురుని గౌరవించు  గుణిగ పంచుము విద్య
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టు విలువ రీతి పుణ్య సంస్కృతిడు నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట.॥

*********::**************************
శీర్షిక  : మనుజ తెలుసుకొను మంచి మాట. 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.

31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ  
 పలుకసత్యమాడు  పాపమేటికి నీకు 
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
 పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు బాట
 పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
 పలుకు శాంతి నేల పలుధర్మ  శాస్త్రాలు
 .మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
 
 34.
 ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పెక్కు నిధులు
గురుని గౌరవించు  గుణిగ పంచుము విద్య 
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టు విలువ రీతి పుణ్య సంస్కృతిడు నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న 
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥

మంచి బాట నెంచి మహిలోన  మసలేటి
మనిషి కాన రాడు మాయ గాదె
ధరణి గాచు నిధులు  ధర్మ - న్యాయములేగ
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేసి దుష్కృుతములు చేసి యన్యాయమ్ము
 కుాడ బెట్టి సొమ్ము కుళ్ళ బెట్టి
 ప్రజల ఉసురు తగులు ప్రారబ్ద మదియేల
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
ధర్మ చింతనేల ధన్యు డౌదువు నీవు
 న్యాయ మార్గ మిడిన మేయ కీర్తి
 మెచ్చు జనులు నిన్ను మేటి గుణుడవంచు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
 మహిని న్యాయ బాట మదిని ధర్మపు చింత
 మనసు కిచ్చు శాంతి , మహిని సుఖము
 యశము లిచ్చు మేటి  యజ్ఞమ్ము  న్యాయము
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేయకన్యాయమ్ము చేటు నీకది జేయు.
పాప మదియె పండ  పట్టు చీడ
కర్మ ఫలిత మిలను కడుదుఃఖ తరమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

నీతి బాటను నడచు నిత్య సంతోషుండు.
ప్రీతి జేసి పనుల ఖ్యాతి బడయు.
సుఖము నిచ్చు బ్రతుకు సుంతైన చాలుగా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥



🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment